టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. వ్యక్తిగత కారణాల వల్లే ప్రభాస్ ఓటు హక్కును వినియోగించుకోలేదని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఆ సమయంలో కూడా ప్రభాస్ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ప్రభాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లినా భారీ సంఖ్యలో అభిమానులు ఆయనను చుట్టుముట్టే అవకాశం ఉంది.
ఈ రీజన్ వల్లే ప్రభాస్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ కు ఓటు హక్కు లేదని గతంలో కూడా ఓటు వేయలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే స్టార్ హీరో ప్రభాస్ స్పందిస్తే మాత్రమే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రభాస్ ఏ పని చేసినా ఏదో ఒక కారణం ఉంటుందని ఆయనను ఈ విషయంలో నిందించాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ కు స్పందించడానికి కూడా సమయం ఇవ్వరా అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుని రోల్ లో కనిపించనున్నారని భోగట్టా. శివుడి పాత్రలో కనిపించే అవకాశం ఇచ్చినా ప్రభాస్ మాత్రం కొన్ని కారణాల వల్ల ఆ రోల్ ను వదులుకున్నారని భోగట్టా.
మరో ఐదు రోజుల్లో కన్నప్ప (Kannappa) టీజర్ రిలీజ్ కానుండగా ఆరోజే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. త్వరలో కల్కి (Kalki) మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుకానున్నాయని తెలుస్తోంది.