ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో తెరకెక్కిన సలార్1 (Salaar) సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించినా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలలో ఈ సినిమా స్వల్పంగా నష్టాలను మిగిల్చింది. మరీ భారీ మొత్తానికి సలార్1 హక్కులను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయి. అయితే ఆ నష్టాలను సలార్1 నిర్మాతలు తాజాగా భర్తీ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సలార్1 నష్టాలను నిర్మాతలు భర్తీ చేయడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి.
త్వరలో సలార్2 మూవీ షూట్ మొదలుకానుందనే సంగతి తెలిసిందే. సలార్1 నష్టాలను భర్తీ చేయని పక్షంలో సలార్2 హక్కులను సలార్1 డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ మొత్తానికి అమ్మాల్సి ఉంటుంది. నష్టాలను భర్తీ చేయకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో లీగల్ గా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. సలార్2 సినిమాకు ఎలాంటి సమస్య ఉండకూడదని భావించి నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్న నేపథ్యంలో సలార్2 సినిమాను పూర్తి చేసి తన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని తారక్ ప్రశాంత్ నీల్ ను కోరినట్టు సమాచారం అందుతోంది. సలార్2 వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ప్రభాస్ ఆ సమయానికి ఇప్పటికే ప్రకటించిన కొన్ని సినిమాల షూటింగ్ ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాలను సక్సెస్ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నారు.
ప్రభాస్ సినిమాల ప్రమోషన్స్ పై కూడా దృష్టి పెడితే కలెక్షన్స్ మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ప్రభాస్ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. సలార్2 సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. సలార్2 మూవీలో యుద్ధ సన్నివేశాలు సైతం ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?