Ravi Teja: రవితేజ డిసెంబర్ నెల ట్రాక్ రికార్డ్.. ‘ధమాకా’ పరిస్థితి ఏంటో…?

  • December 16, 2022 / 04:52 PM IST

మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ట్రేడ్ లోనూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఈ ఏడాది రవితేజ నుండి వచ్చిన ‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అయినప్పటికీ నెక్స్ట్ వీక్ రాబోతున్న ‘ధమాకా’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతోంది. క్రిస్మస్ సీజన్ కలిసొచ్చి ఈ మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి అని టీం భావిస్తుంది.

విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా పై మంచి హైప్ ఏర్పడటానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఏంటి? వాటి ఫలితాలు ఏంటి? టోటల్ గా రవితేజ డిసెంబర్ నెల ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనే విషయాల పై ఓ లుక్కేద్దాం రండి :

1) అన్వేషణ :

‘నీకోసం’ సినిమా టైంలో రవితేజ హీరోగా నటించిన సినిమా ఇది. కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. సూపర్ స్టార్ కృష్ణతో ‘అమ్మ దొంగ’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇతను వి.వి.వినాయక్, శ్రీను వైట్ల వంటి స్టార్ డైరెక్టర్లకు గురువు. వాళ్ళు ఇతని దగ్గర పనిచేశారు. అయితే 2002 డిసెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సినిమా పెద్ద ప్లాప్ గా మిగిలింది.

2) ఖతర్నాక్ :

‘రణం’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అమ్మ రాజశేఖర్ ‘విక్రమార్కుడు’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. కాంబినేషనల్ మూవీ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. అయితే 2006 డిసెంబర్ 14న రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది.

3) సారొచ్చారు :

రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2012 డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ మూవీ పెద్ద ప్లాప్ గా మిగిలింది.

4) బెంగాల్ టైగర్ :

రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2015 డిసెంబర్ 10 న రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది.

సో ఇది…! గతంలో డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన రవితేజ 4 సినిమాల్లో ఒక్క ‘బెంగాల్ టైగర్’ మాత్రమే హిట్ అయ్యింది. మిగిలినవన్నీ ఫ్లాప్ అయ్యాయి. మరి డిసెంబర్ 23న రిలీజ్ కాబోతున్న ‘ధమాకా’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus