Anushka: అనుష్క శరీర బరువు పెరగడానికి అదే కారణమా?

  • September 25, 2023 / 03:43 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి ఒకరు ఈమె నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనుష్క అనంతరం వరుస సినిమాలలో నటిస్తు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఇక ఈ సినిమా తర్వాత ఈమె కొన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇకపోతే అనుష్క సినీ కెరియర్లో ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రయోగాత్మక చిత్రాలలో కూడా ఈమె నటించి మెప్పించారు. ఇలాంటి సినిమాలలో సైజ్ జీరో ఒకటి అని చెప్పాలి.

ఈ సినిమాలో అనుష్క విపరీతమైనటువంటి శరీర బరువు పెరిగారు. ఈ సినిమా తర్వాత ఈమె తన శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారని చెప్పాలి. అయితే సైజ్ జీరో సినిమాలో అనుష్క ఇలా శరీర బరువు పెరగడం కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ తీసుకున్న కారణంగానే ఆమె శరీర బరువు పెరిగారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పలువురు సెలబ్రిటీలు విచారణకు హాజరవుతున్నటువంటి తరుణంలో అనుష్కకు సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎంతోమంది అనుష్క అభిమానులు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు. ఆమె డ్రగ్స్ తీసుకొని శరీర బరువు పెరగలేదని సహజంగానే శరీర బరువు పెరిగారు అంటూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus