Krithi Shetty: కృతి శెట్టి .. వరుస ప్లాప్ లకు అదే కారణమట..!

17 ఏళ్ళకే సినిమాల్లో ఛాన్స్ వచ్చింది.. 18 ఏళ్ళకే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో తెలుసు కదా..! యెస్.. కృతి శెట్టి. ‘ఉప్పెన’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ తొలి సినిమాతోనే ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా వల్ల హీరోకి పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. కానీ కృతి శెట్టికి మాత్రం బాగా కలిసొచ్చింది. వరుసగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది.

అటు తర్వాత వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం సూపర్ హిట్ కాగా, అటు తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ కూడా మంచి విజయాన్ని అందుకుని ఈమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. దీంతో ఒక్కసారిగా ఈమె పారితోషికం కూడా పెంచేసి దర్శక నిర్మాతలను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. అయితే అటు తర్వాత ఈమె నటించిన ‘ది వారియర్’ ‘మాచర్ల నియోజకవర్గం’ వంటి చిత్రాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

ప్రస్తుతం ఈమె నాగ చైతన్య సరసన ‘కస్టడీ’, ‘శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. మరో మలయాళం సినిమాలో కూడా నటిస్తుందని టాక్ వినిపించింది. ఇవి తప్ప ఈమె ఖాతాలో మరో సినిమా లేదు. ఇవి కూడా సక్సెస్ అయితేనే ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయి. మరోపక్క ఈమె పారితోషికం కోటి పది లక్షల నుండి 50 లక్షలకు పడిపోయినట్టు తెలుస్తుంది.

‘బంగార్రాజు’ వరకు ఈమె (Krithi Shetty) పారితోషికానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందట. అందువల్లనే ఈమెకు అవకాశాలు లేకుండా పోయాయి అంటూ ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. మరోపక్క శ్రీలీల, సంయుక్త మీనన్ వంటి భామలు దూసుకుపోతున్నారు. వాళ్ళ పోటీ కూడా ఈమెకు ఎక్కువైనట్టు తెలుస్తుంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus