Bhola Shankar: ఆ డైరెక్టర్ సాయం వల్లే మెహర్ రమేష్ కు భోళా ఛాన్స్ దక్కిందా?

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన మెహర్ రమేష్ త్వరలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని అయన నమ్ముతున్నారు. చిరంజీవికి వీరాభిమాని అయిన మెహర్ రమేష్ మెగాస్టార్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తానని భావిస్తున్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ చిరంజీవితో సినిమా తీయాలనేది నా డ్రీమ్ అని నా ఫస్ట్ మూవీ వీర కన్నడిగ అని చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22వ తేదీన ఈ సినిమా షూట్ మొదలైందని ఆయన పేర్కొన్నారు.

చిరంజీవిపై ఉండే అభిమానంతో స్క్రిప్ట్ లను రెడీ చేసేవాడినని మెహర్ రమేష్ వెల్లడించారు. నేను చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్న సమయంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లారని మెహర్ రమేష్ వెల్లడించారు. చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం నాకోసమే అని అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఖైదీ నంబర్ 150 సినిమా కోసం నేను కూడా హెల్ప్ చేశానని మెహర్ రమేష్ వెల్లడించారు.

వి.వి.వినాయక్ గారు చిరంజీవితో మెహర్ రమేష్ తో సినిమా చేయాలని కోరగా చిరంజీవి గారు సైతం నాతో పని చేస్తానని చెప్పారని ఆయన అన్నారు. వేదాళం సినిమా తమిళంలో హిట్టైందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. అన్నయ్య ఎలా ఉంటే నాకు బాగా నచ్చుతుందో అలానే ఈ సినిమా తీశానని మెహర్ రమేష్ వెల్లడించారు. మెహర్ రమేష్ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా భోళా శంకర్ (Bhola Shankar) మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. కమర్షియల్ గా ఈ సినిమా మరిన్ని రికార్డులను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus