రాజమౌళి సినిమాలంటేనే మౌళి.. అంటే మాయ. ఇప్పటివరకు రాజమౌళి సినిమాలంటే యాక్షన్ + డివోషనల్ + ఫాంటసీ చూశాం. కానీ మొదటిసారి టైంలైన్స్ చూడబోతున్నాం. 512 CE (కామన్ ఎరా)లో మొదలైన కథ 2027 CE కి కనెక్ట్ చేశాడు రాజమౌళి. మధ్యలో త్రేతాయుగాన్ని, అందులోనూ రామాయణంలోని అత్యంత కీలక ఘట్టమైన రావణ సంహారం ప్రధానాంశంగా “వారణాసి” ఉండబోతోందని గ్లింప్స్ లోనే చూపించారు రాజమౌళి.
అయితే.. ఈ గ్లింప్స్ లో పేర్కొన్న కొన్ని దేశాలు మాత్రం #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్ కి అసలైన మీనింగ్ లా నిలిచాయి. అంటార్టిక రీజియన్ లో చూపించిన రోస్ ఐస్ షెల్ఫ్ అనేది ప్రపంచంలో పెద్దదైన ఐస్క్ ముక్క. 1841 లో సర్ జేమ్స్ క్లార్క్ రాస్ అనే ప్రొఫెసర్ దీన్ని గుర్తించారు, అందుకే ఆ మంచు ముక్కకు రాస్ అనే పేరు పెట్టారు. 512 లో అంతరిక్షం నుండి ఊడిపడిన ఉల్కగా శ్వాంభవిని కనెక్ట్ చేశాడు రాజమౌళి.
అయితే.. ఆఫ్రికా, ఉగ్రభత్తి గుహ వంటివి మాత్రం ఊహాత్మకంగా ఉన్నాయి. విజువల్స్ ద్వారా ఉల్కతో మొదలైన కథకు త్రేతాయుగం కనెక్ట్ ఏంటి? దానికి 2027 సంవత్సరం మరియు మణికర్ణిక ఘాట్ తో సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే మాత్రం 2027 సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.
అయితే రాజమౌళి ఊహకు అవధులు ఉండవు కాబట్టి.. గ్లోబ్ ట్రోటర్ కి టైమ్ ట్రాటర్ కూడా యాడ్ అయ్యింది కాబట్టి.. వారణాసితో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్న సందేశం అయితే ఇచ్చాడు రాజమౌళి.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అంటార్టీకా ఖండం అనేది భారతదేశంతో కలిసి ఉండేది.. గ్లోబల్ ఛేంజస్ కారణంగా అది వేరైంది. ఈ హిస్టారికల్ డేటా మొత్తం రాజమౌళి మార్క్ గ్రాఫిక్స్ తో చూపించగలిగితే.. అఖండ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది.