Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 2, 2026 / 03:41 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • హర్ష్ రోషన్ (Hero)
  • నక్షత్ర (Heroine)
  • అజయ్, శరణ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, దీపక్ మాలి తదితరులు (Cast)
  • రమేష్ బండ్రెడ్డి (Director)
  • కృష్ణ కొమ్మలపాటి (Producer)
  • విజయ్ బల్గేనిన్ (Music)
  • గుహన్ (Cinematography)
  • కార్తీక శ్రీనివాస్ ఆర్ (Editor)
  • Release Date : 2nd అక్టోబ‌ర్‌ 2026
  • అరుణాచల క్రియేషన్స్ (Banner)

‘కోర్ట్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి, టీనేజ్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు హర్ష్ రోషన్. ఆ తర్వాత అతను చేసిన ‘బ్యాండ్ మేళం’ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కొద్దిపాటి వసూళ్లు రాబట్టి పర్వాలేదనిపించుకుంది. ఇక ఇప్పుడు ‘తెల్లకాగితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు బాగానే ఉన్నప్పటికీ సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. కానీ, సినిమాకి సంబంధించి లీక్ అయిన ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం, ఆ తర్వాత టీమ్ ఈ విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆడియన్స్ ఫోకస్ ఈ సినిమాపై పడింది. దీంతో సినిమాపై కొంతమేర అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా యూత్ ఈ సినిమా చూడాలని ఆశపడుతున్నారు.మరి ఆ అంచనాలను ఈ సినిమా మ్యాచ్ చేస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

Thella Kagitham Movie Review

Thella Kagitham Movie Review And Rating

కథ: రాము (హర్ష్ రోషన్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో, అన్న వదినలు అతన్ని చేరదీసి సొంత కొడుకులా పెంచుకుంటారు. వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకున్న రాము ఎంతో బాధ్యతగా చదువుకుంటూ ఉంటాడు. అదే సమయంలో స్కూల్లో ఆశ (నక్షత్ర) అనే అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.

రాము ప్రాణ స్నేహితుడు శివ (దీపక్ మాలి). అయితే, శివ వాళ్ల మావయ్య అయిన బెజవాడ మావయ్య (రాజ్ కుమార్ కసిరెడ్డి) రాముని తప్పుదారి పట్టిస్తాడు (మిస్ గైడ్ చేస్తాడు). అతని మాటలు విని రాము, ఆశ విషయంలో హద్దులు దాటుతాడు. ఫలితంగా ఆశ గర్భవతి అవుతుంది.

ఈ విషయం ఆమె తండ్రి, మెడికల్ షాప్ యజమాని అయిన మూర్తికి (అజయ్) తెలిశాక వీరి జీవితాలు ఏ మలుపు తిరిగాయి? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే మిగిలిన కథ.

Thella Kagitham Movie Review And Rating

నటీనటుల పనితీరు: హర్ష్ రోషన్ ఈ సినిమాలో కొత్తగా చేసింది ఏమీ లేదు. ఆల్మోస్ట్ కోర్ట్ లో చేసిన పాత్ర లాంటిదే ఇది. అతనికి ఛాలెంజ్ అంటే ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ లో యాక్ట్ చేయడం. హీరోయిన్ నక్షత్ర విషయానికి వస్తే.. ఆమె లుక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలికించింది. ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంది అనిపించొచ్చు. ఇక హీరోయిన్ తండ్రిగా మెడికల్ షాప్ మూర్తి పాత్ర చేసిన అజయ్ కి ఇది స్పెషల్ రోల్. అతను బాగానే చేశాడు. కానీ అది కోర్ట్ లో మంగపతి పాత్ర రేంజ్ హై ఇవ్వదు.

కమెడియన్ గా రేంజ్ పెంచుకుంటూ పోతున్న రాజ్ కుమార్ కసిరెడ్డికి ఈ సినిమాలో మరో విలక్షణమైన పాత్ర దొరికింది. తన నటనతో ఆ పాత్రకి నిండుతనం తీసుకొచ్చాడు. శరణ్య కూడా వదిన పాత్రలో మెప్పించింది. మిగతా నటీనటుల్లో ఫ్రెండ్ పాత్ర చేసిన పిల్లాడు బాగానే చేశాడు.

Thella Kagitham Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: టీనేజ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘చిత్రం’ సినిమా వీటికి బీజం వేసిందని అనుకోవచ్చు. ఆ తర్వాత టెన్త్ క్లాస్, కొత్త బంగారు లోకం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇటీవల హుషారు పిట్టలు అనే సినిమా కూడా వచ్చింది. ఆల్మోస్ట్ అలాంటి సినిమానే ఈ ‘తెల్లకాగితం’. కాకపోతే గతంలో జరిగిన ఓ యథార్థ సంఘటనను ఆధారం చేసుకుని దర్శకుడు రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఫస్ట్ హాఫ్ సాదాసీదాగానే ఉంది. కానీ సెకండాఫ్‌లో ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. టీనేజ్‌‌లో యువత తప్పుడు నిర్ణయాలు తీసుకుని సమస్యల్లో పడితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులకు చెప్పాలని, మొదట వారు కోప్పడినా తర్వాత ఏదో ఒక రకంగా ఆ సమస్యల నుండి బయటపడేస్తారని, లైఫ్ పాడవకుండా చూస్తారనే విలువైన మెసేజ్‌ను దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. విజయ్ బల్గేనిన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నందు రాసిన సంభాషణలు, ముఖ్యంగా వదిన పాత్రతో చెప్పించిన మెచ్యూరిటీ డైలాగ్ ఓ దశాబ్ద కాలం వరకు గుర్తుపెట్టుకునేలా ఉంది. గుహన్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్.

Thella Kagitham Movie Review And Rating

విశ్లేషణ: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కోర్ట్ సినిమా రేంజ్లో కాకపోయినా ఈ తెల్ల కాగితం కూడా మంచి సినిమానే. సెకండాఫ్ కోసమైనా ఈ సినిమాని ఒకసారి థియేటర్లలో ట్రై చేయొచ్చు.

Thella Kagitham Movie Review And Rating

ఫోకస్ పాయింట్: డీసెంట్ అండ్ మీనింగ్ ఫుల్ టీనేజ్ లవ్ స్టోరీ

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harsh Roshan
  • #Nakshatra
  • #Ramesh Bandreddi
  • #Thella Kagitham Movie

Reviews

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

44 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

2 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

4 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

17 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

24 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version