‘ఆచార్య’ టు ‘ఆర్.ఆర్.ఆర్’.. ఫైనల్ స్టేజ్ లో ఉన్న 10 పెద్ద సినిమాల లిస్ట్..!

2020 డిసెంబర్ చివరి వారం నుండీ థియేటర్లు తెరుచుకున్నాయి. జనవరిలో విడుదలైన అన్ని సినిమాలు దాదాపు బాగానే ఆడాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా బ్లాక్ బస్టర్ లు పడ్డాయి. మీడియం రేంజ్ సినిమాలే భారీ వసూళ్ళు సాధించడంతో మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమ త్వరగానే కోలుకుందని అంతా సంతోషించారు.అయితే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో థియేటర్లు మళ్ళీ మూతపడటం..

షూటింగ్లు నిలిచిపోవడం జరిగింది.దీంతో పెద్ద సినిమాల రిలీజ్ కు కరోనా సెకండ్ వేవ్ అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. అయితే రాబోయే పెద్ద సినిమాల్లో చాలా వరకు షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్నవే..! మరి ఆ సినిమాలు ఏంటి?.. ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ జరిపితే ఫినిష్ అవుతాయి అనే విషయాల పై ఓ లుక్కేద్దాం రండి :

1) ‘ఆర్.ఆర్.ఆర్’ :

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవి పూర్తవ్వడానికి అలాగే ప్యాచ్ వర్క్ తో కలిపి 62 రోజులు టైం పడుతుంది. అక్టోబర్ 13న రిలీజ్ డేట్ అని ప్రకటించారు. మరి ఆ టైం లో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి..!

2) కె.జి.ఎఫ్2 :

యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గాను మరో 40 రోజులు టైం పడుతుందని సమాచారం.

3) ఆచార్య :

చిరు – కొరటాల కాంబినేషన్లో రాబోతున్న ‘ఆచార్య’ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మరో 10 లేదా 12 రోజులు షూటింగ్ చేస్తే ‘ఆచార్య’ షూటింగ్ పూర్తవుతుంది. చిరంజీవి, చరణ్, సోనూసూద్ కాంబినేషనల్ సీన్స్ బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం.

4) అఖండ:

బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ మరో 3 వారాలు బ్యాలెన్స్ ఉందట. శ్రీకాంత్,బాలయ్య కాంబినేషనల్ సీన్స్‌తో పాటూ మరికొన్ని మెయిన్ పాత్రలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట.

5) రాధే శ్యామ్ :

ప్రభాస్- పూజా హెగ్డే ల ‘రాధే శ్యామ్’ ను జూలై 30 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.కానీ ఈ చిత్రానికి సంబంధించి మరో 10 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ప్రభాస్ వారం రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో పాల్గొనాలని తెలుస్తుంది.

6) నారప్ప :

మరో 2 వారాలు షూటింగ్ జరిపితే వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ ఫినిష్ అయినట్టే అని తెలుస్తుంది.

7) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ :

అఖిల్- పూజా హెగ్డే కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ ను మరో 16 రోజుల పాటు నిర్వహించాల్సి ఉందట.

8) పుష్ప :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ పూర్తవ్వడానికి మరో 23 రోజుల పాటు టైం పడుతుంది.

9) శ్యామ్ సింగ రాయ్ :

నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మరో 2 వారాలు బ్యాలెన్స్ ఉందట.

10) లవ్ స్టోరీ :

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే కొంత టెక్నికల్ వర్క్ బ్యాలెన్స్ ఉందట. దానికి 4 లేదా 5 రోజులు చాలని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus