Maname: ‘మనమే’ పైనే ఆశలు పెట్టుకున్నారు.. ఏమవుతుందో ఏమో..!

శర్వానంద్ (Sharwanand) .. హీరోగా శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వంలో ‘మనమే’ (Manamey) అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ కెరీర్లో 35 వ సినిమాగా రూపొందుతుంది ‘మనమే’. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. శ్రీరామ్ ఆదిత్య మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ‘భలే మంచి రోజు’ (Bhale Manchi Roju) ‘శమంతకమణి’ (Shamanthakamani) ‘దేవదాస్’ (Devadas) ‘హీరో’ వంటి సినిమాలు చేశాడు.

ఇందులో ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ పర్వాలేదు అనిపించాయి. ‘దేవదాస్’ కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. ‘హీరో’ సినిమా అయితే డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇప్పుడు రూటు మార్చి అతను ఓ కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ చాలా మందికి ముఖ్యం. ‘పీపుల్ మీడియా..’ సంస్థకి ఇటీవల హిట్లు లేవు. గత ఏడాది నుండి చూసుకుంటే వీళ్ళ సినిమాలు అన్నీ ప్లాపులే.

సో వాళ్ళకి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు.. కానీ, ఆ ఫామ్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత అతని పై ఉంది. అంతేకాదు హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఆమెకి కూడా ‘మనమే’ సక్సెస్ చాలా కీలకం.

వీరితో పాటు యంగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అతను చేసిన సినిమాలు ఓటీటీల పరంగా గట్టెక్కాయి కానీ.. అతనికి థియేట్రికల్ సక్సెస్ ఇంకా పడలేదు. ‘మనమే’ లో అతని రోల్ పెద్దది. సో ఈ సినిమా సక్సెస్ అయితే అతనికి మరింత క్రేజ్ పెరుగుతుంది. సో అతనికి కూడా ‘మనమే’ సక్సెస్ చాలా కీలకంగా మారింది అని చెప్పాలి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus