ఈ సారి ‘బిగ్ బాస్’ కు స్పెషల్ అట్రాక్షన్?

  • July 10, 2020 / 09:30 PM IST

సౌత్ లో కూడా ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి ఆదరణ పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే 3 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని, మూడవ సీజన్ ను నాగార్జున సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసారు. 4 వ సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక ‘బిగ్ బాస్4’ కు సంబంధించిన అధికారిక ప్రకటన జూలై నెలాఖరు లోగా రానుందని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయం పై ఓ క్లారిటీ వచ్చేసింది.

ఆల్రెడీ కంటెస్టెంట్ ల ఎంపిక జరిగిపోయిందని.. వారికి క*నా టెస్టులు చేసి.. ప్రస్తుతం హోమ్ క్వరెంటైన్లో ఉంచారని.. ప్రచారం జరుగుతుంది.అయితే ఇప్పటి వరకూ జరిగిన సీజన్ల కంటే కూడా.. ఈ సీజన్లో కాస్త డోస్ ఎక్కువే ఉండనుందనేది తాజా సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ‘బిగ్ బాస్4’ కోసం యామిని భాస్కర్.. ప్రియా వడ్లమాని.. హంసా నందిని.. శ్రద్దా దాస్ తో పాటు మరికొందరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేశారట. వీరిలో ఫైనల్ గా ఎవరు ఉంటారు అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన వెస్ట్ గోదావరి అమ్మాయి స్వీటీ .. అలాగే రమ్య పసుపులేటి వంటి గ్లామర్ క్వీన్స్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకరు ఎలిమినేట్ అయినా.. మరొకరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపి గ్లామర్ డోస్ కు ఏమాత్రం లోటు లేకుండా చెయ్యాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అలా చేస్తే.. టి.ఆర్.పి కూడా గట్టిగా వస్తుందనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు..!

1 – యామిని భాస్కర్

2 – ప్రియా వడ్లమాని

3 – హంసా నందిని

4 – శ్రద్దా దాస్

5 – స్వీటీ

6 – రమ్య పసుపులేటి

7 – హైపర్ ఆది

8 – బిత్తిరి సత్తి

9 – సింగర్ మంగ్లీ

10 – హీరో తరుణ్

11 – నందు

12 – యాంకర్ ఝూన్సీ

13 – సింగర్ సునీత

14 – వర్షిణి

15 – వైవా హర్ష

16 – తాగుబోతు రమేష్


Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus