మహా భారతంలో పాత్రలకు ఈ స్టార్స్ సెట్!

భారతీయులు గౌరవించే మహా గ్రంథం మహాభారతం. ఈ గొప్ప గాథను ఇప్పటి వరకు అనేక సార్లు సినిమాలుగా, టీవీ సీరియల్ గా తీశారు. అయినా ఎప్పటికీ బోర్ కొట్టని కావ్యం ఇది. అందుకే దీనిని వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కలలు కంటున్నారు. అతనే బాగా సినిమాగా మలచగలరని భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఆయన ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా  డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సినీ అభిమానులు ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నారు. ఓ వీరాభిమాని ఒకరు మహాభారతంలోని పాత్రలకు మన హీరోల్లో ఎవరు సూట్ అవుతారో స్కెచ్ లు గీసి చూపించారు.

అతని ఆలోచన సూపర్ అని నెటిజనులు అభినందనలు గుప్పిస్తున్నారు. ఇందులో తెలుగు హీరోల్లో ప్రభాస్ కి మాత్రమే చోటు కల్పించారు. భీముడిగా బాహుబలి సూట్ అవుతారని డ్రాయింగ్ వేసి తెలిపారు. ఇక కీలకమైన కృష్ణుడి పాత్రలో అమీర్ ఖాన్ , భీష్ముడిగా అమితాబ్ బచ్చన్, గంగ గా ఐశ్వర్యారాయ్, ద్రౌపదిగా దీపికా పదుకునే మ్యాచ్ అవుతారని స్కెచెస్ తో వివరించారు. మిగిలిన ముఖ్య పాత్రలన్నీ కింది స్కెచ్ లలో చూడండి.

Pics Credit :: ScrollDroll

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus