శ్రీదేవి జయంతికి ఇదే ఘన నివాళి!: ఇషాచావ్లా

అందరికీ నమస్కారం!…. నేను మీ ఇషాచావ్లా.నేడు అతిలోక సుందరి శ్రీదేవి జన్మదినోత్సవం (జయంతి). ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా మిషన్ గ్రీన్, ముంబై ద్వారా దాదాపు 101 పండ్లమొక్కలు రైతు కుటుంబాలకు అందజేస్తున్నాం.నేను శ్రీదేవి గారిని ఇన్సిప్రేషన్ గా తీసుకుని పలు రకాల పాత్రలు చేసాను.ఆమె మన జీవితంలో ఓ భాగంగా మారిపోయారు. అలాగే మంచి ఆరోగ్యాన్ని అందించే పండ్లను అందించే చెట్లు కూడా మన జీవితంలో ఓ భాగమే! ఈ పండ్ల చెట్లు వాతావరణంలో పొల్యూషన్ ను కంట్రోల్ చేస్తాయి. కొన్ని రైతు కుటుంబాలకు ఆదాయం వస్తుంది. ఆయా కుటుంబాలు ఆనందంగా ఉంటాయని నా భావన. గ్రీనరీ పెరుగుతుంది. రైతులకు మంచి జరుగుతుంది. పొల్యూషన్ లేని పండ్లు అందుతాయి.

అందుకే ఆ చాందినిని గుర్తు చేసుకుంటూ, ఆ వెన్నెల రాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ మా మిషన్ గ్రీన్ , ముంబై సంస్థ ద్వారా ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం.ఇదే మనం ఆమెకు ఇచ్చే ఘన నివాళిగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు………… మీ ఇషాచావ్లా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus