Pushpa2: పుష్ప2 సినిమాకు అసలు సమస్య ఇదే!

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించడంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ సినిమాకు అటు సుకుమార్ ఇటు బన్నీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్ప ది రూల్ షూటింగ్ ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో జరగనుంది. పుష్ప ది రూల్ 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ హక్కులను తక్కువ మొత్తానికే విక్రయించడంతో నిర్మాతలకు ఎక్కువ మొత్తంలో లాభాలు రాలేదు. పుష్ప ది రూల్ హక్కులకు భారీ డిమాండ్ ఉన్నా షూటింగ్ కు ముందే బడ్జెట్ శృతి మించుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టడం లేదని సమాచారం.

బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ ను పుష్ప2 పోస్టర్ ఫోటోల కోసం పిలిపించారు. పుష్ప2 వచ్చే ఏడాది డిసెంబర్ సమయానికి రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ సక్సెస్ కావడం వల్లే ఈ సినిమా బడ్జెట్ అంచనాలకు మించి పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్లు సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నవాళ్లే కావడంతో ఈ సినిమాపై అంచనాలు, బడ్జెట్ అంతకంతకూ పెరుగుతున్నాయి.

పుష్ప2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా నిర్మాతలకు మిగిలేది ఏమీ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న కామెంట్ల విషయంలో మైత్రీ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ సక్సెస్ సాధించడం బన్నీకి కీలకమనే సంగతి తెలిసిందే.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus