రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉంది. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో శుక్రవారం రోజున విడుదలవుతాయి. అయితే ది వారియర్ సినిమా మాత్రం గురువారం రోజునే థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదు. తమిళంలో లింగుస్వామికి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉన్నా గత కొన్నేళ్లలో లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ ఏడాది విడుదలైన సినిమాలలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు తక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. కేజీఎఫ్2, విక్రమ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినా ఈ సినిమాలు డబ్బింగ్ సినిమాలు అనే సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మధ్య కాలంలో రామ్ నటించిన సినిమాలలో ఇస్మార్ట్ శంకర్ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు. ఇప్పటికే విడుదలైన ది వారియర్ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ట్రైలర్ కొత్తగా లేదని కామెంట్లు వినిపించాయి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చుడటానికి క్యూ కట్టే పరిస్థితులు లేవు. ప్రమోషన్స్, పబ్లిసిటీలో వేగం పెంచితే మాత్రమే ది వారియర్ సినిమాకు ప్రయోజనం చేకూరుతోంది. రామ్ ఈ విషయాలపై దృష్టి పెట్టి మరో సక్సెస్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.
రామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రామ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు విజయాలను అందుకుంటే మాత్రమే భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడతాయి. ది వారియర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే ఆది పినిశెట్టికి టాలీవుడ్ నుంచి ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!