Vijay: విజయ్ కొత్త మూవీకి ప్రభాస్ మూవీకి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. మళ్లీరావా, జెర్సీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న గౌతమ్ తిన్ననూరి తర్వాత మూవీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనుంది. అయితే విజయ్ దేవరకొండ గౌతమ్ కాంబో మూవీలోని కొన్ని సీన్లు శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఉంటాయని సమాచారం అందుతోంది. ఛత్రపతి సినిమాలో కూడా శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ మూవీ తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. విజయ్ గౌతమ్ కాంబో మూవీ సితార బ్యానర్ పై తెరకెక్కుతుండటం గమనార్హం. సితార నిర్మాతలు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోందని సమాచారం అందుతోంది. ఫ్యామిలీస్టార్ మూవీ విడుదలైన వెంటనే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ గత సినిమా ఖుషి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవగా తర్వాత ప్రాజెక్ట్ లతో విజయ్ దేవరకొండ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజయ్యేలా విజయ్ దేవరకొండ కెరీర్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అంటే మినిమం గ్యారంటీ మూవీ అని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉంది. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

విజయ్ (Vijay) ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. విజయ్ సోషల్ మీడియాలో సైతం ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. పలు ప్రముఖ కంపెనీలకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus