Upasana: ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

మెగా కోడలు ఉపాసనను మెగా అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు. సినీ ఇండస్ట్రీతో డైరెక్ట్ గా సంబంధాలు లేకపోయినా రామ్ చరణ్ భార్య కావడంతో హీరోయిన్లకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఉపాసనకు సైతం అదే స్థాయిలో క్రేజ్ ఉంది. ఉపాసన ఎక్కడ ఏం మాట్లాడినా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. తాజాగా ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లైన పదేళ్ల తర్వాత ఉపాసన రామ్ చరణ్ తల్లీదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

చరణ్ ఉపాసన కూతురు పేరు క్లీంకార కాగా క్లీంకార ఫోటోలు ఎక్కడా రివీల్ కాకుండా మెగా ఫ్యామిలీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించిన తర్వాతే పిల్లల్ని కనాలని భావించిన ఉపాసన చరణ్ ఆ దిశగానే అడుగులు వేశారు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. మహిళలు హెల్త్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాసన చెప్పుకొచ్చారు.

మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారని ఆమె కామెంట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ హెల్త్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఉపాసన వెల్లడించారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె తెలిపారు. లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు. నేను పిల్లల్ని ఆలస్యంగా కనాలని అనుకున్నానని నా పక్కనున్న మేడమ్ కూడా పిల్లలను లేట్ గానే కన్నారని ఉపాసన చెప్పుకొచ్చారు.

ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధ పడలేదని ఆమె (Upasana) కామెంట్లు చేశారు. అది నా ఇష్టమని ఆమె వెల్లడించారు. నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా సిద్ధంగా ఉన్నానని ఉపాసన తెలిపారు. ఉపాసన త్వరలో సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన తీపికబురును చెబుతారేమో చూడాలి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus