మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చివరికి ఆ వార్తలను నిజం చేస్తూ ఈ దంపతులు విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇలా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య విడిపోయారని అధికారక ప్రకటన వచ్చేసింది. ఇలా ఈ దంపతులు విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వీరిద్దరూ అధికారికంగా విడిపోతున్నారని తెలుస్తోంది.
ఇక వీరి విడాకుల వార్తలు వైరల్ కావడంతో అసలు విడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిహారిక వెంకటచైతన్య విడిపోవడానికి కారణం మనస్పర్థలే అని తెలుస్తుంది. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి నిహారిక ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేనటువంటి వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. ఈ విధంగా వీరిద్దరూ వివాహం చేసుకోవడంతో నిహారిక సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో కొనసాగడానికి ఆసక్తి చూపారు కానీ అందుకు చైతన్య ఫ్యామిలీ ఒప్పుకోలేదని తెలుస్తుంది.
అంతేకాకుండా నిహారిక జిమ్ లో తన ట్రైనర్ పై కూర్చుని వర్కౌట్ చేసినటువంటి వీడియో గతంలో సంచలనంగా మారింది. ఈ వీడియో కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయని సమాచారం. ఈ విధంగా ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి నిహారిక రాడిసన్ పబ్ లోపోలీసులకు దొరికిపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకున్నాయని దీంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇలా నిహారిక (Niharika) జొన్నలగడ్డ వెంకట చైతన్య విడాకులకు కారణం ఈ విభేదాలేనని తెలుస్తుంది.వీరిద్దరి వివాహ 2020 డిసెంబర్ 9వ తేదీ ఎంతో ఘనంగా జరిగింది అయితే పెళ్లైన రెండు సంవత్సరాలకి వీరిద్దరూ విడాకులు తీసుకోవడం గమనార్హం.