టాలీవుడ్ ఇండస్ట్రీలోని నంబర్ వన్ హీరోల రేసులో ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరనే సంగతి తెలిసిందే. జయాపజయాలకు అతీతంగా రామ్ చరణ్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చాలామంది హీరోలతో పోల్చి చూస్తే రామ్ చరణ్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే. అయితే జంజీర్ సినిమాతో చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తుఫాన్ పేరుతో తెలుగులో విడుదలైంది. జంజీర్ సినిమాలో చరణ్ నటించిన సమయంలో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ పై బాలీవుడ్ క్రిటిక్స్ విమర్శలు చేశారు.
ఆ సమయంలో చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఫీలయ్యారు. చిరుత సినిమాతో హీరోగా రామ్ చరణ్ కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మగధీర సినిమాతో రామ్ చరణ్ కు స్టార్ స్టేటస్ వచ్చిందనే సంగతి తెలిసిందే. జంజీర్ సినిమాలో ఏసీపీ విజయ్ ఖన్నా రోల్ లో రామ్ చరణ్ నటించారు. 2013 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కాగా ఈ మూవీపై తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. చరణ్ యాక్టింగ్ గురించి, ఎక్స్ ప్రెషన్స్ గురించి ప్రధానంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆ తర్వాత చరణ్ స్ట్రెయిట్ హిందీ సినిమాలపై ఆసక్తి చూపలేదు. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే. చరణ్ తమ సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించాలని బాలీవుడ్ స్టార్స్ సైతం కోరుకుంటున్నారు. ఒకప్పుడు చరణ్ కు నటన రాదని కామెంట్లు చేసిన వాళ్లు ఇప్పుడు చరణ్ గురించి గొప్పగా ప్రశంసిస్తున్నారు. చరణ్ గొప్పదనాన్ని, నటనను భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.
హాలీవుడ్ డైరెక్టర్లు, ఇతర భాషల హీరోయిన్లు చరణ్ తో ఫోటో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు. నటుడిగా చరణ్ స్థాయి అంచనాలకు మించి పెరిగిందని తనను విమర్శించిన వాళ్ల నోర్లను చరణ్ మూయించాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.