Ram Charan: చరణ్ బుచ్చిబాబు మూవీకి కలిసొస్తున్న సెంటిమెంట్.. ఏం జరిగిందంటే?
- July 16, 2024 / 06:56 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసినా ఇప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమా లుక్ లోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ (Shankar) సూచనల మేరకు కొన్నిరోజుల పాటు చరణ్ ఆ సినిమా లుక్ లోనే కనిపించనున్నారని తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్ నెల నుంచి చరణ్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni) , జైలర్ (Jailer) సినిమాలు హిట్ గా నిలిచిన నేపథ్యంలో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కూడా బ్లాక్ బస్టర్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ బుచ్చిబాబు కాంబో సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ నటించడం వల్ల కర్ణాటకలో సైతం ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

శివరాజ్ కుమార్ కు వ్యక్తిగతంగా ఉన్న మంచి పేరు, ఇమేజ్ కూడా సినిమాలకు ప్లస్ అవుతోంది. ఎలాంటి సినిమాలో నటించినా ప్రత్యేకతను చాటుకునే రోల్స్ కు శివరాజ్ కుమార్ ప్రాధాన్యత ఇస్తున్నారు. శివరాజ్ కుమార్ చరణ్ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. 2025లో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ విడుదల కానుందని తెలుస్తోంది.
స్క్రిప్ట్, లొకేషన్స్ ఫైనలైజ్ కావడంతో వేగంగా ఈ సినిమా షూట్ జరిగేలా మేకర్స్ ప్లాన్స్ ఉన్నాయని భోగట్టా. బుచ్చిబాబు ఈ సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ బ్రేక్ చేయడంతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను అంతకంతకూ పెంచుతున్నాయి.

















