గత వారమే మనం మాట్లాడుకున్నాం.. ‘వారణాసి’ సినిమాను వార్తల్లో ఉంచేలా ప్రతి వారం ఏదో ఒక పాయింట్‌ను బయటకు తీస్తున్నారు అని. అదే టీమే చేస్తోందా.. లేక ఆ విషయాలే బయటకు వస్తున్నాయా అని తెలియదు కానీ.. ఈ వారం కూడా ఓ వార్త బయటకు వచ్చింది. ఎప్పటిలాగే ఈ విషయాన్ని నమ్మాలో లేదో తెలియదు కానీ.. విషయం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రూమర్ సినిమా భారీ రిలీజ్ కోసం కాబట్టి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే టీమ్ చెప్పిందని తెలుసు కదా.
ఇక లేటెస్ట్ రూమర్ గురించి చూస్తే.. ‘వారణాసి’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారని కొత్తగా చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’, ‘ఈగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలు ఇచ్చిన స్థాయిని ఇంకాస్త పెంచుకునేలా రాజమౌళి ‘వారణాసి’ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాఉ. ఈ క్రమంలోనే ఏకంగా 50 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అనే వార్త బయటకు వచ్చింది. అంతే కాదు 120కిపైగా దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెబుతున్నారు. ఈ మేరకు డబ్బింగ్ ఏర్పాట్లు చేస్తున్నారట దర్శకుడు రాజమౌళి.
మామూలుగా అయితే సినిమాను ఇలా అంతర్జాతీయ భాషల్లో డబ్బింగ్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడేస్తున్నారు. మనం ఇప్పుడు వింటున్న కొన్ని ఇంగ్లిష్ సినిమాల ఇండియన్ లాంగ్వేజ్‌ల డబ్బింగ్.. కొన్ని ఇండియన్ సినిమాల ఇంగ్లిష్ డబ్బింగ్ ఇలానే చేస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం దీని కోసం 1500 మంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌లను సిద్ధం చేస్తున్నారట. వారందరి వాయిస్‌ను చెక్ చేసి, టెస్ట్ చేసి.. ఒరిజినల్ వాయిస్‌కి దగ్గరగా ఉండేలా చూసుకుంటున్నారట. త్వరలోనే ఈ డబ్బింగ్ పనులు స్టార్ట్ చేస్తారట.
అయితే.. సినిమా టీమ్ చెప్పినట్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేయాలంటే, అందులోనూ 50 భాషల్లో.. 120 దేశాల్లో రిలీజ్ చేయాలంటే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ఇదంతా జనవరి నుండే స్టార్ట్ అవ్వాలి. అంటే ఈ లోపు మిగిలిన పనులు అవ్వాలి. చూద్దాం ఈ పనులన్నీ చేసి రాజమౌళి మాట నిలబెట్టుకుంటారేమో.