మొన్న మోహన్ బాబు ఫ్యామిలీ.. ఇప్పుడు జగపతి బాబు ఫ్యామిలీ..!

ఎవ్వరూ ఊహించని విధంగా ఈమధ్యే మోహన్ బాబు ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లడం పెద్ద కలకలం రేపింది. ఆ కారులో నలుగురు దుండగులు మోహన్ బాబుని మరియు అతని ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారు. వాళ్ళు ఎవరు అన్న విషయం బహిరంగంగా ప్రకటించలేదు కానీ వారినైతే పోలీసులు గుర్తించారని తగిన చర్యలు తీసుకున్నట్టు మాత్రం వార్తలు వచ్చాయి. అంతకు ముందు హీరోయిన్ పూర్ణను కూడా పెళ్లి వంకతో మభ్యపెట్టి డబ్బులు గుంజాలని ఓ ముఠా ప్లాన్ చేసింది.

కానీ పోలీసులు వారిని కనిపెట్టి అరెస్ట్ చేసే సమయంలో వారు తప్పించుకున్నారు. వరుసగా సినీ సెలబ్రిటీలను కొందరు దుండగులు ఇలా టార్గెట్ చెయ్యడంతో.. పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా జగపతి బాబు ఫ్యామిలీకి కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. వివరాల్లోకి వెళితే.. జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడు యుగేంద్ర కుమార్ ను చంపేస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట‌.దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఫిలింన‌గ‌ర్‌లో ఉంటున్న యుగేంద్ర కుమార్‌కు గుట్ట‌ల బేగంపేట‌కు చెందిన శ్రీ‌నివాస్ అనే వ్యక్తి నుండే ఇలాంటి బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్టు సమాచారం.

గుట్ట‌ల బేగంపేట‌లోని ఓ స్థ‌లం విష‌యంలో యుగేంద్ర‌కుమార్‌కు అలాగే శ్రీ‌నివాస్ కు మధ్య వివాదాలు తలెత్తడంతో.. ఇలా చంపేస్తామని ఫోన్ చేసి బెదిరిస్తున్నటు యుగేంద్ర పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నాడట‌. ఈ ఇష్యూలో బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యేకాల‌నీకి చెందిన రాజిరెడ్డి హ‌స్తం కూడా ఉన్నట్టు టాక్ నడుస్తుంది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus