ఈ వారం రాబోయే సినిమాల బాక్సాఫీస్ టార్గెట్

మొత్తానికి చాలా రోజుల అనంతరం మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో లవ్ స్టొరీ తప్పితే ఏ సినిమా కూడా బాక్సాఫీస్ టార్గెట్ ను అంత ఈజీగా అందుకోలేక పోయాయి. ఇక ఈ వారం వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా గురువారం మహాసముద్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించారు.

ఫుల్ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా 560కి పైగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇక బాక్సాఫీస్ వద్ద 14కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అఖిల్ అక్కినేని – పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. . MEB సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18.5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే 19కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.

ఇది కాస్త కష్టమైన టార్గెట్ అని చెప్పవచ్చు. ఇక శ్రీకాంత్ తనయుడు పెళ్లి సందD సినిమా కూడా శుక్రవారమే రాబోతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 7.4కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 7.8కోట్ల వరకు షేర్ అందుకుంటే సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఈ బాక్సాఫీస్ టార్గెట్ లో ఎవరు ముందుగా ప్రాఫిట్స్ లోకి వస్తారో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus