కమల్ హాసన్ -మణిరత్నం కాంబినేషన్ అనగానే అందరికీ ‘నాయకుడు'(నాయగన్) వంటి కల్ట్ సినిమా గుర్తుకొస్తుంది. అలాంటి గొప్ప సినిమా తర్వాత.. వీళ్ళ కలయికలో ఓ సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఏర్పడతాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అలా 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘థగ్ లైఫ్'(Thug Life) వచ్చింది. 2025 జూన్ 5న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మొదటి రోజు ఓపెనింగ్స్ ఓకే అనిపించాయి. కానీ 2వ రోజు నుండి దారుణంగా పడిపోయింది. తర్వాత కోలుకుంది అంటూ లేదు. ఒకసారి ‘థగ్ లైఫ్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.84 cr |
| సీడెడ్ | 0.27 cr |
| ఉత్తరాంధ్ర | 0.30 cr |
| ఈస్ట్ | 0.11 cr |
| వెస్ట్ | 0.08 cr |
| గుంటూరు | 0.16 cr |
| కృష్ణా | 0.22 cr |
| నెల్లూరు | 0.08 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.06 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.10 cr |
| ఓవర్సీస్ | 0.12 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 2.28 cr |
‘థగ్ లైఫ్’ కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.2.28 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.68 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ కి రూ.10.22 కోట్ల(షేర్) దూరంలో ఆగిపోయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.