Tiger Nageswara Rao Collections: ‘టైగర్..’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆయన ‘కార్తికేయ 2 ‘ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నిర్మాత. ఇక స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఈ సినిమా రూపొందింది. టైగర్ నాగేశ్వరరావు గురించి చాలా మంది కథలు కథలుగా వినే ఉంటారు.

ఈయన్ని రాబిన్ హుడ్ అని ప్రశంసించే వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అలాగే రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది.దీంతో అక్టోబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే భారీ పోటీ వల్ల కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు.కానీ మరీ తీసి పారేసే విధంగా అయితే తగ్గిపోలేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  6.62 cr
సీడెడ్ 3.38 cr
ఉత్తరాంధ్ర 2.10 cr
ఈస్ట్ 1.35 cr
వెస్ట్ 0.87 cr
గుంటూరు 1.81 cr
కృష్ణా 1.07 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.45 cr
ఓవర్సీస్ 1.75 cr
మిగిలిన భాషల్లో 0.61 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 21.71 cr (షేర్)

‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రానికి రూ.36.06 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.37 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.21.71 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.15.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది అంత ఈజీ అయితే కాదు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus