Tiger Nageswara Rao: మాస్ మహారాజ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల టార్గెట్ ఎంతో మీకు తెలుసా?

  • October 16, 2023 / 07:25 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ నెల 20వ తేదీన భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో ఉండగా రిలీజ్ సమయానికి బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 10 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో ఈ సినిమా విడుదలవుతోంది.

రవితేజ గత సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. అందువల్ల ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. మాస్ మహారాజ్ మాత్రం ఈ సినిమా నిరాశపరిచే ఛాన్స్ లేదని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అదే సమయంలో తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధిస్తుందని సైతం నమ్మకంతో ఉన్నారు. నార్త్ ఇండియాలో సైతం ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమా (Tiger Nageswara Rao) ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడ్డారు.

దర్శకుడు వంశీ ఈ సినిమాతో సక్సెస్ సాధించి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాలని ఫీలవుతున్నారు. ఈ సినిమా అంచనాలను మించి రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. రవితేజ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచిపోనుంది. రవితేజ పారితోషికం ప్రస్తుతం 22 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లకు రవితేజ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

రవితేజ ఈగిల్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. పండుగలను టార్గెట్ చేస్తూ రవితేజ సినిమాలు తెరకెక్కుతున్నాయి. రవితేజ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త డైరెక్టర్లకు రవితేజ ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. త్వరలో రవితేజ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus