Tiger Nageswara Rao OTT: టైగర్ నాగేశ్వరరావు ఓటిటిలోకి ముందుగానే రావడానికి కారణం అదేనా..!

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. తొలుత చాలా లేటుగా ఓటీటీలోకి తీసుకొద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్చే సేయాలనిఅనుకుంటున్నారు. ఇప్పుడీ విషయం మూవీ లవర్స్‌ని ఎగ్జైట్ చేస్తోంది. స్టూవర్టుపురం గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు చాలామందికి తెలుసు. ఆ ఊరిలో నుంచి వచ్చిన గజదొంగగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి టైగర్ నాగేశ్వరావు. ఆయన జీవితం ఆధారంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అని సినిమా తీశారు.

ఇందులో రవితేజ టైటిల్ రోల్ చేశాడు. దసరా కానుకగా అక్టోబరు 20న థియేటర్లలోకి వచ్చింది. కానీ కంటెంట్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్లాన్ ప్రకారం ఆరు వారాల తర్వాత అంటే డిసెంబరు మొదటి వారం చివర్లో ఓటీటీలోకి ఈ (Tiger Nageswara Rao) సినిమా తీసుకురావాలి. కానీ టాక్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారింది.

అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోరిలీజ్ చేయబోతున్నారట. అంటే నవంబరు 24న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. రవితేజ సినిమానే కాదు విజయ్ ‘లియో’ కూడా నెల రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ మొన్నీ మధ్యే ‘లియో’ ఫుల్ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది. దీంతో వీళ్లు కూడా ప్లాన్ మార్చుకున్నారు.

అలా నవంబరు 24న ఓటీటీలోకి వస్తాదనుకున్న లియో.. నవంబరు 16నే రానుందని అంటున్నారు. ఇలా స్టార్ హీరోల సినిమాలు అనుకున్న సమయం కంటే ముందే రానున్నాయనే విషయం.మూవీ లవర్స్‌కి కిక్ ఇస్తోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus