Krishna Shroff: టాప్‌లెస్‌ ఫోజిచ్చిన కృష్ణ ష్రాఫ్!

  • July 24, 2021 / 12:26 PM IST

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తుంటారు. ఆయన కొడుకు టైగర్ ష్రాఫ్ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన కూతురు కృష్ణ ష్రాఫ్ కూడా నటిగా ఎంట్రీ ఇస్తుందని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె తన సోదరుడితో కలిసి ‘ఎంఎంఏ’ పేరుతో ట్రైనింగ్ సెంటర్ ను రన్ చేస్తున్నారు. ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే తన శరీర సౌష్టవంతో ఆశ్చర్యపరుస్తుంది.

తాజాగా ‘హెచ్ హెచ్ మ్యాగజైన్ ఇండియా’కి ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం అమ్మడు బోల్డ్ ఫోటోషూట్ లో పాల్గొంది. హీరోయిన్ రేంజ్ కి ఎంతమాత్రం తక్కువ కాదంటూ ఆమె ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆల్ ఐస్ ఆన్ కృష్ణ’ అనే పేరుతో ప్రచురించిన ఆమె ఇంటర్వ్యూ కోసం ఏకంగా టాప్‌లెస్‌ గా ఫోజులిచ్చింది. లెదర్ ప్యాంట్ మాత్రమే ధరించి.. చేతులకు గ్లోవ్స్ ధరించి ‘బ్రేక్ ది నార్మ్స్’ అంటూ అర్ధనగ్నంగా మ్యాగజైన్ కు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను కృష్ణ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. ఓ స్టార్ హీరో కూతురు ఈ రేంజ్ లో ఫోజులివ్వడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలు సైతం ఈ ఫోటోపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నాయి. దిశా పటాని, అతియా శెట్టి లాంటి తారలు కృష్ణ ష్రాఫ్ ను తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి!


Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus