Mega 156: ‘ముల్లోకాల వీరుడు’ కాదు.. ఆ టైటిల్ ఫిక్సట..!

  • October 25, 2023 / 03:00 PM IST

మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్లాప్ పడింది అంటే.. నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటీవల వచ్చిన ‘భోళా శంకర్’ ఫలితం తేడా కొట్టింది. దీంతో కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన ప్రాజెక్ట్ ని ఆయన హోల్డ్ లో పెట్టారు. దీంతో ‘మెగా 157 ‘ గా ప్రకటించబడిన వశిష్ట ప్రాజెక్టు ఇప్పుడు ‘మెగా 156 ‘ అయ్యింది. ‘బింబిసార’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ట..! అతను చెప్పిన కథకి చిరు బాగా ఇంప్రెస్ అయిపోయారు.

అందుకే దీనికి డేట్స్ ఇచ్చేశారు. నిన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సోషియో ఫాంటసీ జోనర్ లో .. పంచభూతాల థీమ్ తో ఈ సినిమా ఉంటుందని కాన్సెప్ట్ పోస్టర్ తో చెప్పకనే చెప్పారు. అయితే టైటిల్ ఏంటి అన్నది ఇంకా ప్రకటించలేదు. చిరు ఇమేజ్ కి తగ్గట్టు చాలా పవర్ఫుల్ గా ఉండాలి. మొదట ‘ముల్లోకాల వీరుడు’ అనే టైటిల్ ను పరిశీలించారు. కానీ ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దీంతో ‘విశ్వంభర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వంభర అంటే భూమి, అతీంద్రియ శక్తి, శ్రీ మహావిష్ణు.. వంటి అర్థాలు వస్తాయి. అందుకే ఈ టైటిల్ నే ఫిక్స్ చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి (Mega 156) ఆ టైటిల్ పక్కా యాప్ట్ అని చిత్ర బృందం అనుకుంటున్నట్లు టాక్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus