లేటైనా ఆ దర్శకుడుకి స్టార్ హీరోనే కావాలట

  • March 26, 2020 / 05:17 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ కొత్త చిత్రాలకు కమిటై ఉన్నారు. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తుండగా, ఎన్టీఆర్ మరియు చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. బన్నీ.. దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ కి సిద్ధం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలు ప్రకటించేశారు.టాలీవుడ్ లో ఇక మిగిలింది కేవలం మహేష్ మాత్రమే. మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం తరువాత ఆయన ఏ దర్శకుడితో కమిట్ కాలేదు.

మొదట్లో దర్శకుడు వంశీ పైడిపల్లితో మూవీ అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వలన అది హోల్డ్ లో పడింది. మహేష్ కొత్త దర్శకుల నుండి కథలు వింటున్నాడని తెలుస్తున్న సమాచారం. కాగా కెరీర్ బిగినింగ్ నుండి దాదాపు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి టాలీవుడ్ నుండి మరో స్టార్ హీరోని ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారు. కొంచెం లేటైనా ఆయనకు స్టార్ హీరోనే కావాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రభాస్, చరణ్, మహేష్ వంటి వారు ఆయనకు అందుబాటులో ఉన్నట్లే లెక్క. ఎందుకనగా ప్రస్తుతం వారు నటించిన చిత్రాలను మినహా ఇస్తే తదుపరి చిత్రాలు ప్రకటించలేదు. మహేష్ అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. మహేష్ మినహా మరే స్టార్ హీరోతో సినిమా చేయాలన్నా ఏడాదికి పైగా ఆయన ఎదురుచూడాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఆయనకు స్టార్ హీరోనే కావాలంట. సురేంధర్ అడిగితే సినిమా చేయడానికి అనేక మంది టు టైర్ హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన స్టార్ హీరో కోసం ఎదురుచూస్తున్నాడట.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus