Rajamouli: జక్కన్న విషయంలో ఫీలవుతున్న స్టార్ హీరోల ఫ్యాన్స్.. ఏమైందంటే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని కోరుకోని హీరో దాదాపుగా ఉండరు. ఇప్పటికే జక్కన్న డైరెక్షన్ లో నటించిన హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్ లో మళ్లీమళ్లీ నటించాలని ఆశ పడుతున్నారు. రాజమౌళి సినిమాలకు సంబంధించి వస్తున్న చిన అప్ డేట్స్ సైతం క్షణాల్లో వైరల్ అవుతున్నాయంటే జక్కన్నపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో సులువుగానే అర్థమవుతుంది. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ప్లానింగ్ విషయంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదేళ్ల సమయం కేటాయిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లలో జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన సినిమా ఆర్.ఆర్.ఆర్ మాత్రమేననే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించని స్థాయిలో హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చరణ్, ఎన్టీఆర్ లకు ఈ సినిమా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది.

అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై ఏడాది అయినా మహేష్ సినిమాకు సంబంధించి పెద్దగా కదలిక లేదు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ మొదలు కావాలంటే మరో 9 నెలలు ఎదురుచూడాల్సిందేనని తెలుస్తోంది. చాలామంది స్టార్ హీరోలు జక్కన్నతో పని చేయాలని ఆసక్తి చూపిస్తున్న తరుణంలో రాజమౌళి ఇతర స్టార్ డైరెక్టర్లలా ఒకింత వేగంతో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.

రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండగా తక్కువ వర్కింగ్ డేస్ లో తర్వాత సినిమాల షూటింగ్ లు పూర్తయ్యేలా జక్కన్న ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. రాజమౌళికి 70 ఏళ్ల వయస్సు వచ్చినా డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus