కళ్యాణ మహోత్సవాన్ని కళ్లకు కట్టిన తెలుగు చిత్రాలు

తెలుగు వారికి పెళ్లికి మించిన వేడుక లేదు. అందుకే అప్పులు చేసైనా సరే ఉత్సవంగా వివాహాన్ని జరిపిస్తుంటారు. ఆ కల్యాణ మహోత్సవాన్ని వర్ణించాలంటే మాటలు సరిపోవు. అందుకే మన దర్శకులు వెండి తెరపైన పెళ్లి తంతును మొత్తం చూపించారు. ఆ సినిమాకు వెళ్తే ఆత్మీయుల పెళ్లికి వెళ్ళినట్లే అనిపిస్తుంది. అటువంటి సినిమాలపై ఫోకస్..

పెళ్లి పుస్తకం పాతికేళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసిన ‘పెళ్లి పుస్తకం’ సినిమా ఇప్పటికీ కొత్త చిత్రంలా అనిపిస్తుంది. పెళ్లి గురించి, భార్య భర్తల మధ్య అనుబంధము గురించి ఇందులో చక్కగా చూపించారు. ఈ చిత్రంలోని “శ్రీరస్తూ…శుభమస్తూ” పాట ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతుంది.

పెళ్లి సందడిసినిమా పేరులోనే కాదు.. సినిమా మొత్తంలోనూ సందడిని నింపారు కె.రాఘవేంద్రరావు. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో వియ్యాల వారి మర్యాదలు, వధూ వరుల మధ్య మానసిక సంఘర్షణలు అందరినీ ఆకట్టుకున్నాయి.

వరుడు ఇది వరకు తెలుగు వారి ఇంట పెళ్లి ఐదు రోజుల పాటు సాగేదని చెబుతుంటారు. ఆ వేడుకను గుణశేఖర్ వరుడు సినిమాతో కళ్లకు కట్టారు. అల్లు అర్జున్ నటించిన ఈ ఫిల్మ్ ఆనాటి, నేటి వారికీ నచ్చింది.

ఆహా కళ్యాణం గుడిలో, ఇళ్లల్లో జరిగే పెళ్లి తంతును ఈ జనరేషన్ వారు ఫంక్షన్ హాల్స్ లోకి మళ్లించారు. నేటి యువతీయువకులకు సౌకర్యంగా ఉండే ఈ వేడుకను నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం లో స్పష్టంగా చూపించారు.

పరుగు పెళ్లి చుట్టూ తిరిగే కథ పరుగు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇందులో డైరక్టర్ భాస్కర్ కళ్యాణం వెనుక ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కూతురి పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించాలో, ఎంత గొప్పగా అత్తారింటికి పంపించాలోనని కలలు కనే ఓ తండ్రి పడే తపనను ప్రతి ఒక్కరికీ తెలిసేలా చిత్రీకరించారు.

చందమామ క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ కుటుంబసభ్యుల మధ్య అనుబంధాన్ని ఎంతో చక్కగా తెరకెక్కిస్తుంటారు. అటువంటిది అత్యంత సహజంగా పెళ్లి వేడుకను, ఆ హంగామాను చందమామ సినిమాలో నింపారు.

అప్పుడప్పుడు పెళ్లి, దాని తర్వాత వచ్చే బాధ్యతలు, పేచీలు వంటి కథాంశంతో రూపుదిద్దుకున్న మరో మంచి సినిమా అప్పుడప్పుడు. రాజా, శ్రీయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేటి యువతను బాగా ఆకట్టుకుంది.

శశిరేఖా పరిణయం పెళ్లి పై కృష్ణ వంశీ తీసిన మరో దృశ్య కావ్యం శశిరేఖా పరిణయం. తరుణ్, జెనీలియా నటించిన ఈ మూవీ వివాహ మహోత్సవంతో మొదలై.. అదే వేడుకతోనే ముగుస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉమ్మడి కుటుంబ సభ్యుల్లో అమ్మాయిలను ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. డబ్బుకు విలువ పెరుగుతున్న ఈ కాలంలో ఆ సంప్రదాయం కనుమరుగవుతోంది. ఎంత డబ్బులు సంపాదించినా అయిన వారిని వదులుకోకూడదని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా శ్రీకాంత్ అడ్డాల చెప్పారు.

ఆహ్వానం మనం ఒక పెళ్ళికి వెళ్ళాం. ఆ జంట కలకలం కలిసి ఉండాలని ఆశీర్వదించాం. అటువంటి జంట విడిపోతున్నామని, ఆ వేడుకకు కూడా రావాలని మనల్ని ఆహానిస్తే ఎలా ఉంటుంది.. అదే ఆహ్వానం సినిమా. శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన ఈ సినిమా మన వివాహబంధం గొప్పదనాన్ని చాటుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus