Ravi Teja: ఆ హీరో విలన్ గా.. బేబి నిర్మాత భారీ స్కెచ్ ..!

హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తుంటారు రవితేజ. ఎన్ని ఫ్లాపులు వచ్చి ఒక్క హిట్ తో కమ్ బ్యాక్ అవుతారు. ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తుంటారు ఆయన. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమా ప్రకటించేస్తుంటారు. ఇలా గ్యాప్ లేకుండా సినిమా చేస్తూనే ఉంటారు. రీతిలో సినిమాలు తీయడం ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాదనే చెప్పాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మాస్ మహారాజ్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు రవితేజ.

ప్రస్తుతం స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో రవితేజను చూసి అభిమానులు సినిమా హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే తన తదుపరి చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా మల్టీ స్టార‌ర్ గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన ఇంకా రాలేదు. కానీ సినిమాకు సంబంధించిన వార్త మాత్రం జోరుగా ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో రవితేజ తో పాటు విశ్వక్సేన్ మరో హీరోగా నటించబోతున్నాడని టాక్. బేబీ సినిమా నిర్మాత ఎస్కే య‌న్ ఈ మల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కలర్ ఫోటోతో హిట్ కొట్టిన సందీప్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఇది ఒక ఎత్తైతే మూవీలో మరో పాత్ర గురించి క్రేజీ అప్ డేట్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలుగ జేస్తుంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మంచు మనోజ్ ను అనుకుంటున్నట్లు తెలుస్తుంది. (Ravi Teja) రవితేజ, విశ్వక్ సేన్, మంచు మనోజ్ కాంబినేషన్ అదిరిపోయేలా ఎస్ కే య‌న్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బేబీ సినిమా నిర్మాత ఈ చిత్రాన్ని భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. మంచు మనోజ్ కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus