Samantha: సమంతని దూరం పెట్టిన టాలీవుడ్ హీరోలు అందుకే విష్ చేయలేదా?

టాలీవుడ్ హీరోలు సమంతను దూరం పెడుతున్నారా అంటే అవుననే తెలుస్తుంది.సమంత ఏప్రిల్ 28వ తేదీ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈమె పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్స్ అందరూ వరుసగా సోషల్ మీడియా వేదికగా సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక హీరోల విషయానికి వస్తే సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరోలందరి సరసన నటించారు.

వీరిలో ఎన్టీఆర్ మినాహ మిగిలిన హీరోలు ఎవరు కూడా సమంతకు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. రామ్ చరణ్ మాత్రమే సమంతకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మిగతా హీరోలెవ్వరు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో టాలీవుడ్ హీరోలు సమంతను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్నారా అందుకే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె నటిస్తున్న ఖుషి సినిమా నుంచి సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఖుషి టీమ్ నుంచి (Samantha) సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు డైరెక్టర్ శివ నిర్వాణ,హీరో విజయ్ దేవరకొండ సైతం సమంతకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపినప్పటికీ స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి హీరోలు మాత్రం సమంతకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ సమంత మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల పుట్టినరోజున, అలాగే వారు నటించిన సినిమాలు విడుదలైన సినిమాల గురించి స్పందిస్తూ ఉంటారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus