తెలుగు సినిమా పరిశ్రమ హీరోల్లో స్నేహితులు చాలామంది ఉన్నారు. కొందరు చిన్నతనం నుండి స్నేహితులు అయితే, మరికొందరు ఏదో ఒక సినిమా కోసమో, సందర్భం కోసమో స్నేహితులుగా ఉంటారు. మరి వీళ్లందరూ ఎలా కలిశారో తెలియదు కానీ కొంతమంది స్టార్ హీరోలందరూ కలసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారని టాలీవుడ్‌లో (Tollywood) చాలా ఏళ్లుగా ఓ చర్చ నడుస్తోంది. దీని గురించి ఇటీవల కథానాయకుడు నాని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన కూడా ఆ గ్రూపు సభ్యుడే మరి.
తన ‘హిట్ 3’ (HIT 3) సినిమా ప్రచారంలో భాగంగా నాని (Nani) ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ గ్రూప్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గ్రూపులో ఎవరెవరు ఉండేవారు, అందులో ఏం చేసేవారు, ఇప్పుడు ఆ గ్రూపు ఏమైంది, ఎందుకిలా జరిగింది లాంటి వివరాలు కూడా చెప్పుకొచ్చారాయన. ఆ గ్రూపు ఇప్పటికీ ఉందని అయితే తాను ఆ గ్రూపులో లేను అని క్లారిటీ ఇచ్చేశాడు నాని. అయితే ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాడనే విషయం తెలియదు.
ఒకానొక సమయంలో ఆ గ్రూపు చాలా యాక్టివ్‌గా ఉండేదని, అయితే తర్వాతర్వాత యాక్టివ్‌గా లేకుండా పోయిందని చెప్పాడు నాని. గ్రూపులోని కొంతమంది నెంబర్లు మారిపోయాయని.. ఆ తర్వాత బిజీ అయిపోయారని అందుకే గ్రూపు యాక్టవ్‌గా లేదు అని వివరించాడు నాని. ఆ గ్రూపులో రామ్‌చరణ్ (Ram Charan), రానా (Prabhas), ప్రభాస్ (Rana Daggubati), నాని, తారక్ (Jr NTR) ఉండేవారు అని సమాచారం. అందులో జోక్స్ ఫార్వర్డ్ చేసుకునేవాళ్లం అని కూడా తెలిపాడు.
నార్మల్ ఫ్రెండ్స్ గ్రూపులానే ఉండేదని కూడా చెప్పాడు. సినిమాల ట్రైలర్‌లను అందులో షేర్ చేసుకునేవాళ్లం అని కూడా చెప్పాడు నాని. నాని మాటలు వింటుంటే ఆ గ్రూపు గురించి చెప్పడంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. గ్రూపులో లేను అంటూ గ్రూపులో ఏం జరుగుతోంది అనేలా మాట్లాడాడు. మ్యూట్‌లో ఉంటుంది అని కూడా అన్నాడు. ఈ లెక్కన ఆ గ్రూప్ కథేంటో చెప్పీ చెప్పనట్లు, అనీ అననట్లు డౌట్ డౌట్‌గా చెప్పాడు నాని.