HIT 3: ‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!

శైలేష్ కొలను (Sailesh Kolanu) ‘హిట్’ (HIT)  సీక్వెల్స్ లో వయొలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. మొదటి భాగాన్ని మించి రెండవ భాగం, రెండవ భాగాన్ని మించి మూడో భాగం అన్నట్టు వయొలెన్స్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ‘హిట్ 3’ (HIT 3) టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా సెన్సార్ అవుతుందా అనే చర్చ కూడా నడిచింది. అయితే మొత్తానికి సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ కోసం సెన్సార్ సభ్యులు చాలా కట్స్ చెప్పారట. అన్ని కట్స్ ఉంటే సోల్ మిస్ అవుతుందని భావించి చిత్ర బృందం ఎ సర్టిఫికెట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. రన్ టైం 157 నిమిషాలు వచ్చింది. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది.

HIT 3

ఫ*క్, చు*టియా,దెం*య్ వంటి పదాల వాడకాన్ని పలు సన్నివేశాల్లో మ్యూట్ చేయడమే కాకుండా నిడివి కూడా తగ్గించారట.

38:30,42:16,56:17,1:51:59 నిమిషాల వద్ద పీకపై కత్తి పెట్టే విజువల్స్ ను కూడా ఫ్లాష్ తో కవర్ చేశారట.

పోలీస్ యూనిఫార్మ్ ను కాల్చే సీన్ ను కూడా సీజీ తో కవర్ చేశారట. 1:40:20 గంటలకు ఆ సీన్ వస్తుందట.

2 గంటల 4 నిమిషాల వద్ద వచ్చే చిన్న పిల్లల సీన్లు సెన్సిటివ్ గా ఉంటాయని నిడివి తగ్గించారట.

2 గంటల 9 నిమిషాల నుండి 2 గంటల 22 నిమిషాల వరకు వచ్చే హింసాత్మక యాక్షన్ ఎపిసోడ్స్ లో కాళ్ళు నరకడం వంటి షాట్స్ ని తగ్గించారట.

అటు తర్వాత రక్తపాతం ఎక్కువగా ఉన్న సీన్ల నిడివి కూడా తగ్గించారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus