Tollywood: సీనియర్ స్టార్ హీరోలకు కొత్త కష్టాలు!

  • July 26, 2021 / 03:59 PM IST

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో వెంకటేష్ నటించిన నారప్ప రిలీజ్ కాగా యంగ్ గెటప్ వెంకటేష్ కు సూట్ కాలేదనే కామెంట్లు వినిపించాయి. యంగ్ నారప్ప పాత్రకు జోడీగా అమ్ము అభిరామి నటించగా వయస్సులో వెంకటేష్ కు అమ్ము అభిరామికి వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఈ జోడీ ప్రేక్షకులను మెప్పించలేదు.

సీనియర్ స్టార్ హీరోలు యంగ్ గెటప్ లో కనిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. మన్మథుడు 2 సినిమా విషయంలో నాగార్జున, రకుల్ జోడీ బాలేదనే కామెంట్లు వినిపించాయి. ఖైదీ నంబర్ 150 లో కాజల్, సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా పక్కన చిరంజీవి ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపించారనే ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.. బాలకృష్ణ సినిమాల విషయంలో కూడా ఈ కామెంట్లు వినిపిస్తున్నాయి.

సీనియర్ స్టార్ హీరోలు కథల విషయంలో మారాలని వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. జోడీ జనాలను ఆకట్టుకోలేకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్నాయి. రొటీన్ మాస్ మసాలా సినిమాలను ప్రేక్షకులు సైతం ఇష్టపడటం లేదు. దృశ్యం 2 తరహా కథలనే వెంకటేష్ ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కథల విషయంలో, ఎంపిక చేసుకునే హీరోయిన్ల విషయంలో సీనియర్ హీరోలు మారతారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus