ఈ విధంగా చిన్న సినిమా నిర్మాతలకి లాభాలు దక్కుతున్నాయి..!

  • April 13, 2020 / 08:30 PM IST

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా … థియేటర్ లు క్లోజ్ అయ్యాయి. సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. కేవలం సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్ షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. దీంతో మళ్ళీ మొదటి నుండీ సీరియల్స్ ను టెలికాస్ట్ చేస్తున్నారు ప్రముఖ ఛానల్స్ వారు. రిపీట్ గా సీరియల్స్ చూసేంత ఇంటెన్షన్, క్యూరియాసిటీ చాలా మంది లేడీస్ కు లేదు. దీంతో చాలా మంది ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ నే నమ్ముకున్నారు.

ఇక ఐ.పి.యల్ మ్యాచ్ లు కూడా లేవు కాబట్టి కుర్రకారు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నే నమ్ముకున్నారు. కావల్సినంత ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది కాబట్టి.. ఇదే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ అని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే టైం లో చిన్న సినిమాల నిర్మాతలకు లాభాలు దక్కుతున్నాయి అని సమాచారం. పెద్ద సినిమాలను కోట్లు పెట్టి కొనుగోలు చేసే అమెజాన్ వారు .. చిన్న సినిమాలకు కొంత వరకూ చెల్లించి.. మిగిలింది.. స్ట్రీమింగ్ టైం ను బట్టి చెల్లిస్తారట.

ఆ రకంగా ‘పలాస’ ‘రాజావారు రాణివారు’ ‘మద’ వంటి చిత్రాలకు రోజూ ఎక్కువ స్ట్రీమింగ్ టైం నమోదు అవుతుందట. దీంతో తక్కువలో తక్కువ లక్ష చొప్పున లెక్క వేసుకున్నా … నిర్మాతలకు అంత మొత్తం అమెజాన్ వారు చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది. ఏమైనా చిన్న సినిమాల నిర్మాతలకు ఈ విధంగా బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. అంతేకాదు చిన్న సినిమాలను కొనుగోలు చేసిన చానల్స్ వారు కూడా సాధ్యమైనంత తొందరగా టెలికాస్ట్ చేసి క్యాష్ చేసుకోవాలి అని భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus