హైదరాబాద్ లో ప్రతీ ఏడాది నిర్వహించే ‘టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజర్ ఈవెంట్’ ఈసారి కూడా ఘనంగా జరిగింది. మాదాపూర్ లోని టీఎంటీ ఆధ్వర్యంలో ఈ ఫాషన్ షో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులంతా వచ్చి సందడి చేశారు. వీళ్ళంతా ర్యాంప్ వాక్ లతో అదరగొట్టారు. నవదీప్, ప్రియాంక జవాల్కర్, సుమంత్, లక్ష్మీ మంచు, అఖిల్, తరుణ్ భాస్కర్, సిద్దు జొన్నలగడ్డ, అదితి రావు హైదరి,
సుధీర్ బాబు,సురభి, వేదిక, నివేదా పేతురేజ్, ప్రిన్స్, సుశాంత్, సందీప్ కిషన్, సామ్రాట్, రుహానీ శర్మ,శివాత్మిక రాజశేఖర్, ప్రగ్యా జైస్వాల్ .. వంటి వారు పాల్గొన్నారు. వీళ్ళ డ్రెస్సులు కూడా బాగా సెట్ అయ్యాయి.. అలాగే చూడ్డానికి ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :