నెట్టింట హల్ చల్ చేస్తున్న స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..!

ఈ లాక్ డౌన్ టైములో సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.వారి అభిమానులు ఆ ఫోటోలకు లైకులు, షేర్లు కొడుతూ..వాటిని వైరల్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు మన శృతీ హాసన్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటికీ.. తన సొంత ట్యాలెంట్ తోనే క్రేజ్ ను సంపాదించుకుంది.

మ్యూజిక్ డైరెక్టర్ గా.. మంచి డ్యాన్సర్ గా కూడా గుర్తింపుతెచ్చుకున్న తరువాత ఆమె హీరోయిన్ గా మారింది. కెరీర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాలు అన్నీ ప్లాపులు అయ్యాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఈమెను గోల్డెన్ లెగ్ గా మార్చేసింది. ఆ తరువాత ఈమె నటించిన సినిమాలు అన్నీ దాదాపు హిట్లే. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో విదేశీయుడితో ప్రేమలో పడి సినిమాలను నిర్లక్ష్యం చేసింది. అయితే కొన్నాళ్ల తరువాత అతనితో బ్రేకప్ చెప్పడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న శృతీ హాసన్.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో కూడా నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన చిన్న నాటి ఫోటోని షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది శృతీ హాసన్. తాను చదవుకున్న అబాకస్ స్కూల్లోని అనుభవాలను ఈ ఫోటో ద్వారా గుర్తుచేసుకుంది. ఈ ఫోటో 1993 లో తీసిందట. ఆమె అభిమానులు ఈ ఫోటోలకు లైకులు వర్షం కురిపిస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus