ప్రభాస్ సినిమాకి పనిచేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరంటే..!

యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా.. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న పాన్ ఇండియా ఫిలిం.. ‘హనుమాన్’.. ‘ది మోస్ట్ పవర్‌ఫుల్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్’ అంటూ హనుమంతుడి శక్తిసామర్థ్యాల ఆధారంగా.. శ్రీమతి చైతన్య సమర్పణలో.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య విడుదల చేసిన ‘హనుమాన్’ టీజర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

టీజర్ సింప్లీ సూపర్బ్ అని చూసిన వాళ్లంతా చెప్తున్నారు. ప్రశాంత్ వర్మ మరోసారి మ్యాజిక్‌తో పాటు మెస్మరైజ్ కూడా చేయనున్నాడనేలా ఉంది టీజర్.. విజువల్స్ మామూలుగా లేవసలు.. టీజర్ ఓపెనింగ్‌లోనే భారీ ఆంజనేయుడి విగ్రహం చూపించి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. బ్యాగ్రౌండ్‌లో వాయిస్ ఓవర్‌గా పవర్‌ఫుల్ హనుమాన్ శ్లోకం వస్తుండగా.. కథలోని కీలక ఘట్టాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ.. సినిమా మీద అంచనాలు పెంచేశాడు..

సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు టీజర్ అదిరిపోయిందంటూ ప్రశాంత్ వర్మను ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ‘హనుమాన్’ టీజర్ గురించి స్పందించారు. ‘‘హనుమాన్’ టీజర్ స్టార్టింగ్ నుండే స్టన్ అయిపోయాను.. వాటర్‌ షాట్స్, హనుమంతుడిని చూపించిన విధానం.. విజువల్స్ చాలా బాగున్నాయి.. మైథాలజీ నేపథ్యంలో చాలా చక్కగా రూపొందించారు. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. టెక్నీషియన్ల ప్యాషన్ కనిపిస్తుంది.. ‘హనుమాన్’ ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ పెద్ద మార్క్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను’’ అంటూ వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు.

సింగీతం శ్రీనివాస రావు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ – K’ మూవీకి స్క్రిప్ట్ మెంటార్‌గా వర్క్ చేస్తున్నారు. ‘హనుమాన్’ టీజర్ చూసిన తర్వాత మూవీ లవర్స్, నెటిజన్లు మరియు ప్రభాస్ ఫ్యాన్స్.. ట్రోలింగ్‌కి గురైన ‘ఆదిపురుష్’ టీజర్ గురించి డైరెక్టర్ ఓం రౌత్‌ని తెగ ఆడేసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి పనిచేస్తున్న దర్శక దిగ్గజం సింగీతం కూడా ‘హనుమాన్’ టీజర్ గురించి మాట్లాడడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus