అవకాశం కోసం అడిగితే ఇంత ఘోరంగా తిడతారా : గెటప్ శ్రీను

  • October 15, 2019 / 07:38 PM IST

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే సాధారణ విషయం కాదు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికైతే ఇది పూల పానుపే..! ఎలాగు వారికి పెద్ద పాత్రలే వస్తాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే.. చాలా కష్టపడాల్సిందే. అలా ఎన్నో అవమానాలు పడ్డవారు కూడా చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను అంటున్నాడు గెటప్ శ్రీను. బుల్లితెర ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయ్యాడు గెటప్ శ్రీను. ఈ షో లో సుడిగాలి సుధీర్ టీంలో ఈయన చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అందులో బాగా పాపులర్ అయిన స్కిట్స్ ‘బిల్డప్ బాబాయ్’ స్కిట్ ఒకటి. ఈ స్కిట్ చూస్తే శ్రీను ట్యాలెంట్ ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు. అంతటి ట్యాలెంట్ ఉన్న శ్రీనుని ఓ డైరెక్టర్ బూతులు తిట్టాడట. ఈ విషయాన్నీ శ్రీనుని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ.. “సినిమాలో అవకాశం కోసం ఓ దర్శకుడికి ఫోన్ చేసాను. అవకాశం ఇమ్మని ఆ దర్శకుడిని ఫోన్ లో అడిగా… కానీ అతడి ప్రవర్తన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విపరీతమైన బూతులతో నన్ను దూషించాడు. ఒక మనిషిని ఇలా కూడా తిడతారా వీళ్ళు.. అని అనిపించింది. ‘ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని’ వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి అవమానులు ఎన్నో నా కెరీర్ ఆరంభంలో ఎదురయ్యాయి” అంటూ చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus