12 ఏళ్ళ ‘బృందావనం’ గురించి మనకు తెలియని సీక్రెట్.. !

  • October 14, 2022 / 02:55 PM IST

ప్రస్తుతం చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అతను కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నప్పటికీ.. ‘బృందావనం’ అనే చిత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకూ మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ ను ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యేలా చేసింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.

2010 అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదలయ్యింది. అంటే ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 12ఏళ్ళు పూర్తికావస్తోంది. ఇదిలా ఉండగా.. ‘బృందావనం’ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే.. అది ఎన్టీఆర్ వద్దకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన ప్రభాస్. దర్శకుడు వంశీ పైడిపల్లి మొదట ప్రభాస్ తో ‘మున్నా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.ఆ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత. అయితే ఆశించిన స్థాయిలో ఆ చిత్రం విజయం సాధించలేదు. ‘ప్రభాస్ నన్ను ఎంతో నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చాడు. కానీ అతనికి హిట్ ఇవ్వలేకపోయాను’ అని వంశీ గిల్టీగా ఫీలయ్యాడట.

దాంతో కొరటాల శివ సాయంతో ‘బృందావనం’ స్క్రిప్ట్ ను రెడీ చేయించుకుని ప్రభాస్ కు వినిపించాడట వంశీ. కానీ అప్పటికే ప్రభాస్.. ‘డార్లింగ్’ మరియు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలకు కమిట్ అయ్యాడని తెలుస్తుంది. నిజానికి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కు కూడా దిల్ రాజే నిర్మాత.ఈ క్రమంలో ప్రభాస్ కచ్చితంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ స్క్రిప్టే చేస్తాను అని తేల్చి చెప్పెయ్యడంతో ‘బృందావనం’ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ను సంప్రదించాడట వంశీ. మొదట ఎన్టీఆర్ కూడా ‘బృందావనం’ స్క్రిప్ట్ పై డౌట్ పడ్డాడట. అయితే కళ్యాణ్ రామ్, రాజమౌళి లు.. కచ్చితంగా ఈ ఫ్యామిలీ చిత్రాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పడంతో ఎన్టీఆర్..ఈ చిత్రం చెయ్యడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus