దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్న హీరోలు!

తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితలకు, దర్శకులకు కొదవలేదు. అందుకే కొంతమంది  హీరోలు వరుసగా సినిమాలను సెట్ చేసుకుంటున్నారు. మరో వర్గం హీరోలు మాత్రం లేటైనా.. లేటెస్ట్ గానే రావాలని అనుకుంటున్నారు. మొదటి వర్గం జాబితాలో నాని, శర్వానంద్, మహేష్ బాబు తదితరులు ఉండగా.. రెండో వర్గం జాబితాలో చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ఉన్నారు. చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’  తర్వాత 151వ చిత్రంగా సైరా నరసింహారెడ్డి  చేస్తున్నారు.

సురేందర్‌ రెడ్డిని దర్శకుడిగా తీసుకున్నాక వెంటనే సినిమా సెట్స్‌పైకి వెళుతుందనుకున్నారు.  స్క్రిప్టుకి మెరుగులు దిద్దడం, సెట్స్ వేయడంతో పాటు చిరు  గురంపై కత్తి సాము చేయడం, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. దాదాపు ఏడాది తర్వాత అంటే డిసెంబర్ లో సైరా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక వెంకటేష్ కూడా దాదాపు 8  నెలల గ్యాప్ తీసుకున్నారు. గురు తర్వాత సినిమాని ఓకే చెప్పడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. తనకి సూటయ్యే కథకోసం వెతికి.. అందుకు తగ్గట్టుగా మారుతున్నారు.  ‘జై లవకుశ’ తర్వాత ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఆ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఇంకా నాలుగునెలల టైం ఉంది. అప్పటిలోగా ఎన్టీఆర్ లుక్ లో మార్పు తీసుకు రావాలని కష్టపడుతున్నారు. కొత్తగా కనబడాలని ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు.

ప్రభాస్‌ కూడా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత కథ, డైరక్టర్ రెడీ గా ఉన్నప్పటికీ  కొని నెలలు గ్యాప్ తీసుకున్నారు. బరువుతగ్గి రోల్ కి తగ్గట్టు మారిపోయి, యాక్షన్ సీన్స్ కోసం ప్రాక్టీస్ చేసిన తర్వాత షూటింగ్ లోకి దిగారు. ఇలా హీరోలు తమ అభిమానులను సర్ ప్రైజ్ చేయడానికి  దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus