ఈ 10 సినిమాల్లోనూ తండ్రీ కొడుకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు..!

  • April 3, 2021 / 11:16 AM IST

సినిమా పరిశ్రమకు చెందిన ఓ ఫ్యామిలీ నుండీ హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త పాయింట్ ఏమీ కాదు. అన్ని ఇండస్ట్రీలలోనూ ఉండేదే..! అయితే తండ్రి ఓ పెద్ద స్టార్ హీరో అయితే అతని ఇమేజ్ ను కాపాడాల్సిన బాధ్యత కొడుకు పైన ఉంటుంది. అది కూడా కొత్త పాయింట్ ఏమీ కాదు.కానీ అదే తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. ‘ఇది మామూలు మాస్ కాదురా మావా’ అనేక తప్పదు. ఇక ఫ్యాన్స్ అయితే.. ‘ఇది కదా మాకు కావాల్సింది’ అని సంబరపడిపోతుంటారు. అయితే ఇది చాలా సందర్భాల్లో జరిగింది. అలా ఒకే స్క్రీన్ పై కనిపించి అభిమానులను ఖుషీ చేయించిన తండ్రీ కొడుకులు అలాగే వాళ్ళు కనిపించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎన్టీఆర్ – బాలకృష్ణ :

‘తాతమ్మ కల’ ‘రామ్ రహీమ్’ ‘అన్నదమ్ముల అనుబంధం’ ‘దాన వీర సూర కర్ణ’ వంటి చాలా చిత్రాల్లో వీళ్ళు కలిసి నటించారు. తన తండ్రి హీరోగా నటించిన సినిమాల ద్వారానే బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేశారు.

2) నాగేశ్వర రావు – నాగార్జున :

కింగ్ నాగార్జున కూడా తన తండ్రి నాగేశ్వర రావు గారితో ‘ఇద్దరూ ఇద్దరే’ ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘అగ్ని పుత్రుడు’ ‘శ్రీరామదాసు’ ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

3) కృష్ణ – మహేష్ బాబు :

బజార్ రౌడీ, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు,వంశీ,టక్కరి దొంగ.. వంటి సినిమాల్లో కృష్ణ- మహేష్ బాబులు కలిసి నటించారు.

4) కృష్ణంరాజు – ప్రభాస్ :

కృష్ణంరాజు గారి సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి ‘బిల్లా’ ‘రెబల్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. త్వరలో రాబోతున్న ‘రాధే శ్యామ్’ చిత్రంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించబోతున్నారు.

5) మోహన్ బాబు – విష్ణు :

తన పెద్ద కొడుకు మంచు విష్ణువర్ధన్ బాబు హీరోగా నటించిన ‘గేమ్’, ‘సలీమ్’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’,’రౌడీ’ వంటి చిత్రాల్లో మోహన్ బాబు కూడా కీలక పాత్రలు పోషించాడు.

6) మోహన్ బాబు- మనోజ్ :

మోహన్ బాబు హీరోగా ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మేజర్ చంద్ర కాంత్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంతోనే మంచు మనోజ్ సినీ రంగ ప్రవేశం చేశాడు. అటు తరువాత తన తండ్రితో కలిసి ‘ఝుమ్మంది నాదం’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి చిత్రాల్లో కలిసి నటించాడు.

7) వెంకటేష్ – రానా :

నటన పరంగా రానా..విక్టరీ వెంకటేష్ వారసుడనే చెప్పాలి. రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో వెంకటేష్ కూడా చిన్న గెస్ట్ రోల్ ఇచ్చాడు.

8) నాగార్జున – నాగ చైతన్య :

‘మనం’ సినిమాలో నాగార్జున – నాగ చైతన్య లు కలిసి నటించారు.అలాగే ‘ప్రేమమ్’ సినిమాలో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

9) నాగార్జున – అఖిల్ :

‘సిసింద్రీ’ సినిమా ద్వారా అఖిల్ సినీ రంగ ప్రవేశం చేసాడు. తరువాత అతను తన తండ్రి నాగార్జునతో కలిసి ‘మనం’ ‘అఖిల్’ చిత్రాల్లో కలిసి నటించాడు.

10) చిరంజీవి – రాంచరణ్ :

‘మగధీర’ సినిమాలో చిరు కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అటు తరువాత ‘బ్రూస్ లీ’ ‘ఖైదీ నెంబర్ 150’ వంటి చిత్రాల్లో కూడా ఈ తండ్రి కొడుకులు సందడి చేశారు. త్వరలో రాబోతున్న ‘ఆచార్య’ చిత్రంలో కూడా రాంచరణ్, చిరు తో కలిసి నటించబోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus