బిగ్ బాస్ 4 : టాప్ – 5 ప్రిడిక్షన్స్ చెప్తున్న బిగ్ బాస్ విన్నర్ కౌషల్..!

  • November 22, 2020 / 05:14 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 లో కౌషల్ కి ఆడిన రేంజ్, వచ్చిన క్రేజ్, బయట ఇమేజ్ వేరనే చెప్పాలి. అలాంటి సీజన్ మళ్లీ బహుశా రాదేమో అన్నట్లుగా గేమ్ ఆడాడు బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకున్నాడు. తనదైన స్టైల్లో గేమ్ ఆడి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు కౌషల్ బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటే బాగుంటుందనేది తన మనసులో మాటల్ని పంచుకున్నాడు. తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ లో టాప్ – 5 లో వీళ్లు ఉంటే ఆ కిక్కే వేరు అంటున్నాడు.

ఫస్ట్ అభిజిత్, హారికల పేర్లు చెప్పాడు. వీళ్లు గేమ్ ని బాగా అర్ధం చేస్కుని ఆడుతున్నారని, ఖచ్చితంగా టాప్ – 5 లో చోటు సంపాదించుకునే అవకాశం ఉందని అన్నాడు. అంతేకాదు, తర్వాత మాస్ రాజాలాగా హౌస్ లో దుమ్ముదులిపేస్తున్న సోహైల్ కూడా టాప్ 5లో ఉంటాడని చెప్పాడు. ఈ ముగ్గురుతో పాటుగా, కోపం, ప్రేమ , బాధ, ఆవేశం ఇలా అన్నియాక్షన్స్ తో మెప్పిస్తున్న అఖిల్ కూడా టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పాడు. పిట్టకొంచెం కూత గనం అన్నట్లుగా అరియానా చెప్పే లాజిక్స్ కానీ ఆడే ఆటతీరు కానీ చాలా బాగానచ్చిందని, తను కూాడా నా టాప్ 5 లిస్ట్ లో ఉందని చెప్పాడు కౌషల్.

ఈ ఐదుగురు గనక టాప్ – 5 లో ఉంటే ఓటింగ్ లో మంచి కిక్ వస్తుందని టైటిల్ పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. అంతేకాదు, అంతకుముందు తన టాప్ – 2 లిస్ట్ కూడా చెప్పాడు. మాస్ వర్సెస్ క్లాస్ అంటూ అభిజిత్ కి, సోహైల్ కి టైటిల్ పోరు ఉంటుందని కూడా జోస్యం చెప్పాడు. మరి కౌషల్ ఆశించినట్లుగానే టాప్ – 5 లో వీళ్లు ఉంటే ఆ కిక్కే వేరు. అదీ మేటర్.


మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus