రవితేజ `టచ్ చేసి చూడు` షూటింగ్ పూర్తి!
- December 29, 2017 / 11:54 AM ISTByFilmy Focus
మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. .బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు.
నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ “మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. షూటింగ్ పూర్తయింది.ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది“ అని తెలిపారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















