Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న
- August 14, 2026 / 03:31 PM ISTByFilmy Focus Desk
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ అంటూ ఈ మధ్య కాలంలో సినిమా తారలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కోర్టు నుంచి రిలీఫ్ కూడా దొరుకుతోంది. అలా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రముఖ కథానాయిక జాన్వీ కపూర్‌కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ క్లబ్‌లు, అభిమానుల పేజీలపై నిషేధం విధించాలి అంటూ జాన్వీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Janhvi Kapoor
తన క్లైంట్‌పై కొంతమంది/ కొన్ని పేజీలు అభ్యంతరకర వ్యాఖ్యలు, విమర్శలతో పాటు, డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స అశ్లీల కంటెంట్ తయారు చేస్తున్నారని జాన్వీ కపూర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ఫ్యాన్ పేజీ లింక్‌లతో పాటు, సుమారు నాలుగు వేల వెబ్‌సైట్ లింక్‌లను కూడా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు న్యాయస్థానం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విమర్శలు, ఆన్‌లైన్ దూషణలు ప్రజా జీవితంలో భాగమైపోయాయి అంటూ జాన్వీ కోరినట్లుగా అభిమాన సంఘాలు, సోషల్ మీడియా పేజీలపై నిషేధం విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆయా పేజీల్లో అశ్లీలత, అభ్యంతరకర కంటెంట్ ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ ఫ్యాన్ క్లబ్‌లను ఎలా మూసివేయగలం అని ప్రశ్నించింది. అలాగే అన్ని ఫ్యాన్ పేజీలు తప్పుగా ప్రవర్తించడం లేదని, అభిమానంతోనే క్రియేట్ చేసి ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. దాంతోపాటు ‘మీకు అభిమానులు వద్దా?’ అంటూ జాన్వీని ప్రశ్నించింది.
న్యాయస్థానం వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. నటులు ఇలా వ్యక్తిత్వ హక్కులు పరిరక్షణ అంటూ అభిమానుల్ని దూరం చేసుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. ఎవరైనా వ్యతిరేకంగా, ఇబ్బందికరంగా మాట్లాడితే ఓకే కానీ.. ఏమీ అనకపోయినా పేజీలను నిషేధించడమనడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న వస్తోంది.












