టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు 2016 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ సినిమాలు ఒకే సమయంలో విడుదల కాగా ఈ రెండు సినిమాలలో నాన్నకు ప్రేమతో పైచేయి సాధించింది. అయితే 2024 సంవత్సరంలో ఈ ఫీట్ రిపీట్ కానుందని ప్రచారం జరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ కానున్నాయని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.
బాక్సాఫీస్ వద్ద బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడితే ఈ ఇద్దరు హీరోలలో గెలుపు ఎవరి సొంతమవుతుందో చూడాలి. ఈ పోటీ నిజమైతే మాత్రం రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ దేవర 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుందని క్లారిటీ వచ్చేసింది. బాలయ్య బాబీ కాంబో మూవీ 2024 సంవత్సరం మార్చి 29వ తేదీన రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా అధికారికంగా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్ నెలలో సెలవులు ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. (Balakrishna) బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కావడం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లు కీలకం కాగా ఈ సీజన్లలో విడుదలయ్యే సినిమాలకు కలెక్షన్లు ఎక్కువ మొత్తంలో వస్తాయనే సంగతి తెలిసిందే. 2024 సంవత్సరంలో క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజవుతుండగా ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయో చూడాల్సి ఉంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఇద్దరు హీరోల పారితోషికాలు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!