Tripti Dimri: బికినీ ధరించి బీచ్ లో రచ్చ రచ్చ చేస్తున్న త్రిప్తి దిమిరి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ (Animal) సినిమాని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోరు అనే చెప్పాలి. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. టీజర్ తో సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం.. రిలీజ్ అయ్యాక సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. రణబీర్ – రష్మిక..ల మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యింది.

మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో రష్మిక గ్లామర్ షో చేసింది. ఆమె కెరీర్ కూడా కొంచెం స్లోగా ఉన్న టైంలో యానిమల్ వచ్చి.. మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఆమెను డామినేట్ చేస్తూ మరో భామ త్రిప్తి దిమిరి (Tripti Dimri) .. కొంచెం ఎక్కువ మార్కులే కొట్టేసింది అని చెప్పాలి. ‘యానిమల్’ లో త్రిప్తి దిమిరి.. హీరో రణబీర్ తో కలిసి డీప్ లిప్ లాక్ సీన్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ లో నటించింది. ఆమె అందంతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది అని చెప్పాలి.

ఇప్పుడు ఈమె చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. తెలుగు ఫిలిం మేకర్స్ కూడా ఈమె డేట్స్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రవితేజ (Ravi Teja) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమాలతో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు. అయినప్పటికీ ఈమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇక్కడి యువత ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇదిలా ఉండగా.. త్రిప్తి దిమిరి తాజాగా బికినీ ధరించి బీచ్ లో గట్టిగా సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus